బంగ్లాదేశ్‌పై ప్రకృతి కన్నెర్ర!

13 Jun, 2017 19:11 IST|Sakshi
బంగ్లాదేశ్‌పై ప్రకృతి కన్నెర్ర!
  • కొండచరియలు విరిగిపడి 68 మంది మృతి
  • బంగ్లాదేశ్‌పై ప్రకృతి కన్నరెచేసింది.  భారీ వర్షాల ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 68 మంది మృతిచెందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బంగ్లాదేశ్‌లోని ఢాకా, చిట్టగాంగ్‌ నగరాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించి.. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు.

    రంగమతిలో 10 మంది, బందర్బాన్‌లో ఏడుగురు, చిట్టగ్యాంగ్‌లో 8 మంది కొండచరియల కింద సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. అప్రమత్తమైన అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. 2010లోనూ బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఆ సమయంలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వార్తలు