మళ్లీ బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్!

4 Feb, 2015 12:24 IST|Sakshi
మళ్లీ బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్!

 25 నుంచి 28 వరకూ...
 
 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మళ్లీ సమ్మె సైరన్ మోగించారు. వేతనాల పెంపు విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) తాజా ప్రతిపాదనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఈ నెలాఖరులో నాలుగు రోజుల పాటు సమ్మెకు దిగనున్నట్లు బ్యాంక్ యూనియన్లు మంగళవారం ప్రకటించాయి. వేతనాలను 19 శాతం పెంచాలంటూ యూనియన్లు డిమాండ్ చేస్తుండగా.. ఐబీఏ దీన్ని మంగళవారం 13 శాతానికి పెంచింది. ఇది తమకు ఆమోదయోగ్యం కాదని.. యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ ఎంవీ మురళి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25-28 వరకూ సమ్మె చేయాలని నిర్ణయించినట్లు నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ జనరల్ సెక్రటరీ అశ్విని రాణా చెప్పారు.

 కాగా, సంప్రదింపుల్లో తగిన పరిష్కారం లభించకుంటే... మార్చి 16 నుంచి నిరవధిక సమ్మెకూ వెనుకాడబోమని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు