బ్యాంకులు, ఫ్యాక్టరీలు బంద్..

30 Aug, 2016 09:06 IST|Sakshi
బ్యాంకులు, ఫ్యాక్టరీలు బంద్..
న్యూఢిల్లీ :  దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు శుక్రవారం రోజు మూతపడనున్నాయి. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఏడవ వేతన సంఘ సిపారసులను తమకు వర్తింపచేయాలని కనీసం వేతనం నెలకు రూ.18,000లకు పెంచాలనే ప్రధాన డిమాండ్తో పాటు 12 డిమాండ్ల సాధనకు ట్రేడ్ యూనియన్లు సమ్మెకు దిగ్గనున్నాయి. ఫార్మాస్యూటికల్, డిఫెన్స్ వంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు  తలుపులు బార్ల తెరుస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధనలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు శుక్రవారం ఈ సమ్మె  చేయనున్నాయి. .
 
మరోవైపు ట్రేడ్ యూనియన్ల నిర్వహించబోయే ఈ బంద్ను ఎలాగైనా ఆపాలని  కేంద్రప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది.  ఈ విషయంపై ప్రధాని మోదీ నేడు ఎమర్జెన్సీ మీటింగ్ను నిర్వహించారు. ప్రధాని నిర్వహించబోయే ఈ మీటింగ్లో ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, కార్మికశాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం విఫలమవ్వడంతో ప్రధాని మోదీ ఈ మీటింగ్ నిర్వహించారు. మరో 48 గంటల్లో కార్మిక సంఘాలను సంప్రదించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాల వివిధ యూనియన్లు కూడా శుక్రవారం జరగబోయే బంద్లో పాల్గొనబోతుండటంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు తీవ్ర అంతరాయం కలుగనుంది.  అయితే ట్రేడ్ యూనియన్లు నిర్వహించబోయే ఈ బంద్లో రైల్వే ఉద్యోగులు పాల్గొనే సంకేతాలు లేకపోవడంతో, రైళ్లు యథాతథంగా తిరగనున్నట్టు సమాచారం.ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ సమ్మెపై తీవ్ర ఇరకాటంలో పడింది. సమ్మెకు మద్దతిస్తే ప్రభుత్వ పక్షంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నట్టు విమర్శలు వస్తాయని ఆలోచిస్తోంది.
మరిన్ని వార్తలు