'బాపు' గారి బొమ్మలు చూడలేమా ?

13 Jul, 2015 11:24 IST|Sakshi
'బాపు' గారి బొమ్మలు చూడలేమా ?

దుమ్ముగూడెం: కోట్లు వెచ్చించి ప్రతిష్టించిన చిత్రాలకు ఆదరణ లేకుండాపోయింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. 2003లో జరిగిన పుష్కరాల సమయంలో అప్పటి కలెక్టర్, ప్రత్యేకాధికారి అరవింద్‌కుమార్ పర్ణశాలను మరింత అందంగా ముస్తాబు చేయడానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. రూ.1.40కోట్లు కేటాయించి.. రామాయణ దృశ్యాల చిత్రాలను ఏర్పాటు చేసే బాధ్యతను సినీ దర్శకుడు, సీనియర్ చిత్రకారుడు బాపుకు అప్పగించారు.

ఆయన పర్ణశాలను సందర్శించి.. చిత్రాలను ప్రతిష్టించే ప్రాంతాలపై అధ్యయనం చేశారు. సీతా కుటీరంను బాంబోలతో నిర్మించడంతో పాటు చుట్టూ రామాయణ దృశ్యాల ప్రతిమలను ప్రతిష్టించారు. అయితే శిథిలమైన ఆ బొమ్మలు భక్తులకు కనిపించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు వాటిని చూసే భాగ్యం లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.


మరిన్ని వార్తలు