మోన్ శాంటోకి బేయర్ బంపర్ ఆఫర్

21 Sep, 2016 12:23 IST|Sakshi
మోన్ శాంటోకి బేయర్ ఓపెన్ (బంపర్) ఆఫర్

ముంబై: జర్మన్  ఫార్మా అండ్ కెమికల్  దిగ్గజం  బేయర్ గ్రూప్   మోన్ శాంటోకి బంపర్ ఆఫర్ ఇచ్చింది.  రూ.1,100 పైగా కోట్లతో మోన్ శాంటో లోని  26శాతం అదనపు వాటాను కొనుగోలు చేసే మాండేటరీ  ఓపెన్ ఆఫర్ ప్రకటనతో మదుపర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు దిగారు. బీటీ విత్తన దిగ్గజం మోన్‌శాంటో వాటాదారులకు  బేయర్ గ్రూప్ ఈ  ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించడంతో మోన్ శాంటో ఇండియా  షేర్లు  ఇంట్రాడేలో 6 శాతం పైగా ర్యాలీ అయ్యాయి.

ఈ ఓపెన్ ఆఫర్ కింద, బేయర్ రూ 2,481.60 ధరకు  వాటాదారుల నుండి దాదాపు 44.88 లక్షల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇది గత మంగళవారం నాటి మోన్ శాంటో ధరకు దాదాపు 4 శాతం అదనం. భారత నిబంధనల ప్రకారం, ఒక సంస్థ మరో లిస్టెడ్ కంపెనీలోని 15 శాతం వాటావరకు పొందినట్లయితే అది ఓపెన్ ఆఫర్ గా పరిగణించబడుతుంది.

కాగా  బహుళజాతి ఫార్మా, కెమికల్స్ కంపెనీ బేయర్ , అమెరికాకు చెందిన బయోటెక్ అగ్రగామి కంపెనీ మోన్‌శాంటో  విలీనానికి 66 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదిరిన సంగతి  తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు