శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

18 Nov, 2014 13:10 IST|Sakshi
శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

ముంబై: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో తొలిసారిగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని ఆయన వ్యాఖ్యానించారు. ఫడణవిస్ సర్కారు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని అన్నారు. రాయగఢ జిల్లాలోని అలీబాగ్ లో జరిగిన ఎన్సీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చని పేర్కొన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎన్సీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.  ఫడణవిస్ ప్రభుత్వానికి ఎన్సీపీ బయట నుంచి మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. చిరకాల మిత్రపక్షం శివసేనతో తెగతెంపులు చేసుకుని బీజేపీకి ఎన్సీపీ స్నేహహస్తం అందించింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు