అందాలపోటీ విజేత వద్ద బాంబులు

11 Aug, 2013 03:45 IST|Sakshi

ఆమె అందగత్తెల పోటీలో విజేత. అందంతో అందరినీ చంపేస్తుందనుకుంటే.. బాంబులతో చంపబోయిందంటూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆమెపై న్యాయవాదులు ఆరోపణలు కూడా నమోదుచేశారు. ఉటా అందగత్తెల పోటీలో విజేతగా నిలిచిన కెండ్రా మెక్ కెన్జీ గిల్ అనే యువతిని, ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా ఇటీవల అరెస్టు చేశారు. ఈ నలుగురి మీద ఒకే రకమైన ఆరోపణలు ఉన్నట్లు న్యాయవాది బ్లేక్ నకమురా తెలిపారు.

వీరందరి వయసు సుమారు 18 సంవత్సరాలే. వీరిని గత శనివారం చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీళ్లు కొన్ని ప్రమాదకర రసాయనాలు నిండిన ప్లాస్టిక్ సీసాలు కలిగి ఉన్నారు. వాటిని తమకు తెలిసినవాళ్లమీద విసురుతున్నారు. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు.

వాళ్లు ప్రమాదకర పదార్థాలను చుట్టుపక్కల ఇళ్లు, ప్రజల మీద విసురుతుండటంతో వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి పదార్థాలు కలిగి ఉంటే కనిష్ఠంగా ఏడాది నుంచి గరిష్ఠంగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. మిస్ రివర్టన్ పోటీలలో ఇటీవలే గిల్ గెలిచింది.

మరిన్ని వార్తలు