సాయం కోసమే చేతులు చాచాను: మాల్యా

28 Jan, 2017 14:57 IST|Sakshi
సాయం కోసమే చేతులు చాచాను: మాల్యా
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్మాల్యా ఇక అన్ని దారులు మూసుకుపోతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై విరుచుకుపడటం ప్రారంభించారు. ప్రభుత్వం అనుసరించిన విధానాలే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభానికి కారణమయ్యాయంటూ ఆరోపించారు. ఓ వైపు ప్రభుత్వ పాలసీలు, మరోవైపు ఆర్థిక పరిస్థితులు కింగ్ఫిషర్ను దెబ్బతీశాయన్నారు.  ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ఆదుకునేందుకు మాత్రం ప్రభుత్వం పబ్లిక్ ఫండ్స్ అన్నింటిన్నీ వెచ్చించిందని, కానీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు ఎలాంటి బెయిల్ అవుట్ ప్రకటించలేదని ఆరోపించారు. ఎయిరిండియాకు అవసరమైన అన్ని సహాయాలను ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు.
 
విధానాల్లో మార్పుల కొరకే తాను చేతులు చాచానని, రుణాల కోసం కాదని చెప్పుకొచ్చారు. కానీ పాలసీల్లో ఎలాంటి మార్పులు చేపట్టలేదని, దీంతో తన ఎయిర్లైన్స్ తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సాయం కోసమే తాను అర్థించానని, రుణాల కోసం కాదంటూ పలు ట్వీట్లు చేశారు. పబ్లిక్ ఫండ్స్ మొత్తాన్ని ఎయిరిండియాకు అలా ఎలా కేటాయిస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్యారెల్ ఆయిల్ ధర డాలర్లకు పెరగడం, రూపాయి డీవాల్యుయేషన్తో సేల్స్ ట్యాక్స్ భారం ఇవన్నీ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభానికి కారణమని చెప్పారు.
 
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ, కేవలం ప్రభుత్వం అనుసరించిన విధానాలు, ఆర్థిక పరిస్థితుల వల్లే ఇది ఫెయిల్ అయిందంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా తాను  కింగ్ఫిషర్ ఉద్యోగులకు, స్టాక్ హోల్డర్స్ అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని ట్వీట్ చేశారు. సీబీఐ దీన్ని విచారిస్తుందని ఒక్క రూపాయి కూడా తప్పుదోవ పట్టించలేదని మాల్యా తెలిపారు.
 
>
మరిన్ని వార్తలు