నోట్ల రద్దు: బుక్కైన మరో బ్యాంకు మేనేజర్

12 Dec, 2016 14:44 IST|Sakshi
నోట్ల రద్దు: బుక్కైన మరో బ్యాంకు మేనేజర్
పాత నోట్ల రద్దు అనంతరం బ్యాంకు అధికారులు పాల్పడుతున్న అవకతవకలపై ఎన్ని హెచ్చరికలు చేస్తే ఏం లాభం. పాత నోట్ల మార్పిడిలో వారు అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ రద్దైన రూ.71 లక్షలను అక్రమంగా తెల్లనోట్లగా మార్చుకోవడానికి సహాయపడి పట్టుబట్టాడు. వివరాలోకి వెళ్తే... ఎఫ్. లక్ష్మీనారాయణ, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో బసవనగుడి శాఖలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. రూ.50,000కు అక్రమంగా డిమాండ్ డ్రాఫ్ట్లు జారీచేశాడు. అంతేకాక రూ.71.49 లక్షల బ్లాక్మనీని వైట్మనీగా మార్చుకోవడానికి సహాయం చేసినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో తేలింది.
 
లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా  సీబీఐ అతనిపై కేసు నమోదుచేసింది. బ్యాంకు అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని తెలిసి, ఆర్బీఐ పలుమార్లు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. తమ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. అంతేకాక, బ్యాంకు అధికారులు పాల్పడుతున్న అవకతవకలపై సీబీఐ సైతం ఓ కన్నేసింది. ఇటీవలే 27 మంది బ్యాంకు అధికారులను అక్రమాలకు పాల్పడుతున్నారనే నెపంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు