ఐటీ రాజధానిలో డ్రగ్స్‌ కలకలం

18 Jul, 2017 18:44 IST|Sakshi
ఐటీ రాజధానిలో డ్రగ్స్‌ కలకలం

- భారీగా కొకైన్‌ పట్టివేత.. నలుగురి అరెస్ట్‌
బెంగళూరు:
ఒకపక్క హైదరాబాద్‌లో డ్రగ్స్‌ మాఫియా, దానితో సంబంధాలున్నవారిపై కఠిచ చర్యలకు అధికారులు సిద్ధమవుతోన్నవేళ​ అటు భారత ఐటీ రాజధాని బెంగళూరులో సైతం భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడటం కలకలంరేపింది.

బెంగళూరు నగరంలోని బయప్పనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సీసీబీ పోలీసులు మంగళవారం జరిపిన దాడుల్లో సుమారు రూ.8లక్షల విలువైన కొకైన్‌ను స్వాదీనం చేసుకున్నారు. స్థానిక ఎన్‌జీఈఎఫ్‌ లేఔట్‌ సదానందనగర మెయిన్‌రోడ్డుకు సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన విదేశీయులను తనిఖీ చేయగా, వారి వద్ద కొకైన్‌ లభించినట్లు పోలీసులు తెలిపారు.

డ్రగ్స్‌తోపాటు పట్టుబడిన నలుగురిని నైజీరియాకు చెందిన ఆంటోనిఎగ్వోబా, బ్రిటన్‌ నివాసి ఓవెన్‌పెన్‌హాలిజన్, మోజాంబికాలుగా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఏడు సెల్‌ఫోన్లు, ఐపాడ్, రెండు పాస్‌పోర్ట్స్, కారు, బైక్‌ స్వాధీనం చేసుకున్నామని, అన్య అనే వ్యక్తి పేరుతో సిమ్‌కార్డు పొంది మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు గుర్తించామని వివరించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న స్థానికులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు