ఎయిర్‌టెల్ మరో భారీ డీల్‌

23 Mar, 2017 19:29 IST|Sakshi
ఎయిర్‌టెల్ మరో భారీ డీల్‌

ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ భారతి ఎయిర్‌ టెల్‌  కీలక  అడుగు వేసింది.  భారత్‌లో  4జీ ఇంటర్నెట్  సేవల్ని మరింత వేగంగా అందించే దిశగా అడుగులు  వేస్తోంది.  ఈ క్రమంలో ‍ ప్రముఖ దేశీయ బ్రాడ్‌బాండ్‌ సేవల సంస్థ టికోనా ను కొనుగోలు చేయనుంది. రూ.1600కోట్లతో టికోనా 4జీ బిజినెస్‌ను స్వాధీనం చేసుకోనుంది.

టికోనా 4జీ డిజిటల్‌ నెట్‌వర్క్‌ బిజినెస్‌ను కొనుగోలు చేయనున్నట్టు ఎయిర్‌ టెల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్‌ విలువ రూ.1600కోట్లుగా తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా టికోనా బ్రాడ్‌ బాండ్‌ వైర్లెస్ యాక్సెస్ స్పెక్ట్రం సహా,  ఐదు టెలికాం సర్కిల్స్‌లో 350 సైట్లు తమ సొంతంకానున్నట్టు  ఎయిర్టెల్   మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది.

కాగా ఒకవైపు  జియో ఉచిత సేవల  ఎంట్రీతో  రిలయన్స్‌ జియో  సునామీ సృష్టిస్తే.. వొడాఫోన్‌, ఐడియా మెగామెర్జర్‌  టెలికాం  పరిశ్రమలో సంచలనం మారింది. భారతీ ఎయిర్టెల్ నార్వే ఆధారిత టెలినార్ భారత వ్యాపార కొనుగోలు ప్రణాళికలను ప్రకటించింది. మరోవైపు ఈ పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌ టెల్‌ టికోనాతో నిశ్చయాతమ్మకం ఒప్పందం చేసుకోవడం విశేషం. జియో ఎంట్రీ  స్వదేశీ ఒప్పందాలు, విదేశీ సంస్థ నిష్క్రమణకు ఉత్ర్పేరకంగా నిలిచిందని ఎనలిస్టులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు