ఎయిర్టెల్ కొత్త ఎత్తుగడ- ట్రయల్ ఆఫర్ సూపర్

14 Oct, 2016 15:48 IST|Sakshi
ఎయిర్టెల్ కొత్త ఎత్తుగడ - ట్రయల్ ఆఫర్ సూపర్

రిలయన్స్‌ జియో  ఫ్రీ ఆఫర్ల  హవా  కొనసాగుతుండడంతో ఇతర టెలికం  దిగ్గజాలలో  గుబులుమరింత పెరుగుతోంది.  ఎలాగైనా తమకస్టమర్లను నిలపుకోవాలనే యోచనతో ఆఫర్ల  కురిపిస్తున్నాయి. తాజా  మార్కెట్ లీడర్ భారతి ఎయిర్ టెల్   ఎయిర్టెల్  మరో కొత్త ఎత్తుగడ వేసింది. బ్రాడ్ బ్యాండ్  వినియోగదారులకు మూడు నెలలపాటు అన్‌లిమిటెడ్‌  డాటా  ఫ్రీ ఆఫర్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.   దీనికోసం బ్రాడ్ బ్యాండ్  టెక్నాలజీనిని   'వి ఫైబర్ 'టెక్నాలజీతో  అప్ గ్రేడ్ చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీని ద్వారా ఇక  సెకనుకి వరకు 100 మెగాబిట్ ఇంటర్నెట్ వేగాన్ని అందుకుంటుందని తెలిపింది. బ్రిటిష్ టెలికాం,ఫా స్ట్ వెబ్, టి. టెలికాం,  టెలీ ఫోనికా మాత్రమే వాడుతున్న  ఈ కొత్త  టెక్నాలజీని  ద్వారా వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే  అధిక వేగంతో పనిచేసే ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్టు ఎయిర్ టెల్  తెలిపింది.    ఇప్పటికే చెన్నైలో ఈ సేవలను ప్రారంభించామని,  మరో రెండుమూడువారాల్లో దేశమంతా  అమలు చేస్తామని భారతి ఎయిర్ టెల్ డైరెక్టర్ (ఆపరేషన్స్ ) అజయ్ పూరి  ప్రకటించారు.

ఎయిర్టెల్  'వి-ఫైబర్ కొత్త వినియోగదారులకు మూడు నెలల ఉచిత ట్రయల్ ఆఫర్ అందిస్తోంది.   అలాగే రూ 1,299 నుంచిమొదలయ్యే ప్లాన్ లో దేశమంతా ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తున్నామని తెలిపింది.  ముఖ్యంగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో ఎలాంటి భారీ మార్పులు లేకుండానే, కస్టమర్  ప్రాంగణంలో కొత్త వైరింగ్,  డ్రిల్లింగ్  అవసరంలేకుండానే  ఇంటర్నెట్ వేగాన్ని అప్ గ్రేడ్ చేస్తున్నామని ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ప్రస్తుత వినియోగదారులు అధిక చార్జ్ తో,  సేమ్ ప్లాన్ లో   'వి-ఫైబర్' వేగంతో అప్గ్రేడ్ చేసుకోవచ్చని  ప్రకటించింది. దీనికోసం   మోడెమ్ రూ 1,000 చెల్లించాల్సి ఉంటుందని , ఒక వేళ  ఒక నెలలో ఈ సర్వీసులో వినియోగదారుడు సంతృప్తి చెందకపోతే  మోడెం చార్జీలు వెనక్కి తిరిగి చెల్లించబడతాయని ఎయిర్టెల్ ప్రతినిధి చెప్పారు.

తమ రూ 60,000 కోట్ల ప్రాజెక్ట్  అభివృద్ధిలో భాగంగా  ఎయిర్టెల్   ప్రస్తుత బ్రాడ్ బ్యాండ్వేగాన్ని 100 ఎంబీపీఎస్ వేగాన్ని అందుకునేలా  విక్టోరైజేషన్ టెక్నాలజీని  అమలు  చేస్తున్నట్టు  అజయ్ పూరి  స్పష్టం చేశారు.  కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు, చాలా వేగవంతమైన అనుకూలమైన,  అతి తక్కువ ధరకే  అదనపు డేటా అందించటం తమ ధ్యేయమని పూరీ చెప్పారు. మరోవైపు ఇప్పటివరకు, ఈ రంగంలో ఈ ఐదు మిలియన్ల వినియోగదారులు ఎయిర్ టెల్ ఉన్నారనీ,   ఇదే అతిపెద్ద టెక్నాలజీ అప్ గ్రేడ్ అని మార్కెట్ వర్గాల అంచనా.

మరిన్ని వార్తలు