నోట్ల రద్దుతో పంచాయతీల పంట పండింది!

13 Nov, 2016 20:34 IST|Sakshi
హైదరాబాద్‌: పెద్దనోట్ల రద్దు అంశం తెలంగాణలోని గ్రామపంచాయతీలకు అనూహ్యంగా కలిసివచ్చింది. రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లతో ఆస్తిపన్ను చెల్లించేందుకు అవకాశం ఇస్తుండటంతో జనాలు తమ ఆస్తిపన్నును, బకాయిలు చెల్లించేందుకు పోటెత్తుతున్నారు. దీంతో తెలంగాణ అంతటా ఆస్తిపన్ను చెల్లింపులకు విశేషమైన స్పందన లభిస్తోంది.
 
మూడురోజుల్లో రాష్ట్రంలోని పంచాయతీలకు ఆస్తిపన్ను రూపంలో ఏకంగా రూ. 16 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. బాకాయిపడ్డ ఆస్తిపన్ను చెల్లించేందుకు సైతం గ్రామీణులు పంచాయతీల ముందు బారులు తీరుతున్నారు. పాతనోట్లతో పన్ను చెల్లించేందుకు రేపటివరకు గడువు ఉండటంతో సోమవారం కూడా భారీమొత్తం ఆస్తిపన్ను చెల్లింపులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిపడిన ఈ అనూహ్య ఆదాయంతో గ్రామపంచాయతీలు నిధులతో కళకళలాడుతున్నాయి.   
మరిన్ని వార్తలు