ఆటోమేషన్తో కొత్త ఐటీ ఉద్యోగాలు

22 Aug, 2016 11:21 IST|Sakshi

ఆటోమేషన్ ఎఫెక్ట్తో హడలిపోతున్న ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లతో ఐటీ రంగంలో సమూల మార్పులు జరిగి, ఐటీ ఉద్యోగాలకు గండికొడుతుందనే అపోహలకు తెరదించుతూ.. కొత్త ఉద్యోగాలు సృష్టికి ఈ టెక్నాలజీలు సహకరిస్తాయని నాస్కామ్ వెల్లడించింది. ఈ కొత్త టెక్నాలజీలతో లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు కనుమరుగవుతాయని గత కొంత కాలంగా పలు సర్వేలు, నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెక్నాలజీలు తీసుకొచ్చే మార్పులతో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని నాస్కామ్ అధ్యక్షుడు చంద్ర శేఖర్ తెలిపారు. భారత్కు సంబంధించినంత వరకు ఈ టెక్నాలజీల భయాలు తక్కువేనని వెల్లడించారు.

కొన్ని ఉద్యోగాలు కనుమరుగైనప్పటికీ, అధికనైపుణ్యాలతో కూడిన కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపారు. అయితే కోల్పోయే ఉద్యోగాల కంటే తక్కువగానే కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే టెక్నాలజీతో కోల్పోయ్యే ఉద్యోగాల కంటే సృష్టించే ఉద్యోగాలే ఎక్కువగా ఉంటున్నాయని చంద్రశేఖర్ వివరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇండస్ట్రి స్పందించాలని, భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు