లాలూ ఆర్జేడీలో చీలిక

25 Feb, 2014 01:26 IST|Sakshi
లాలూ ఆర్జేడీలో చీలిక

 13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు

 జేడీ(యూ) సర్కారుకు జైకొడుతూ స్పీకర్‌కు లేఖ

 కొద్దిసేపటికే సొంతగూటికి ఆరుగురు ఎమ్మెల్యేలు

 పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీలిపోరుుంది. పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జనతాదళ్ (యూ) నేతృత్వంలోని నితీశ్‌కుమార్ ప్రభుత్వానికి జై కొట్టారు. మైనారిటీ వర్గానికి చెందిన ఐదుగురితో పాటు వీరంతా సోమవారం ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరి నివాసంలో సమావేశమయ్యూరు. ఆర్జేడీని వీడి నితీశ్ సర్కారుకు మద్దతు ప్రకటిస్తున్నట్టుగా తెలియజేస్తూ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరికి ఓ లేఖ రాశారు. స్పీకర్‌కు లేఖ రాసిన విషయూన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ అన్సారీ ధ్రువీకరించారు. అరుుతే అత్యంత నాటకీయంగా వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత కొద్దిసేపటికే తాము వేరుకుంపటి వర్గంలో లేమని స్పష్టం చేశారు.

 సామ్రాట్ చౌదరి, జావెద్ ఇక్బాల్ అన్సారీతో పాటు రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్, దుర్గాప్రసాద్ సింగ్, లలిత్ యూదవ్, అనిరుధ్ కుమార్, జితేంద్ర రాయ్, అక్తర్-ఉల్-ఇస్లాం సాహీన్, అక్తర్-ఉల్-ఇమాన్, అబ్దుల్ గఫూర్, ఫయూజ్, రామ్ లఖన్ రామ్ రమణ్, చంద్రశేఖర్‌ల సంతకాలతో కూడిన లేఖ అసెంబ్లీకి చేరింది. దీంతో మధ్యంతర ఏర్పాటు కింద వారు ప్రత్యేక బృందంగా కూర్చునేందుకు అనుమతి ఇచ్చినట్లు అసెంబ్లీ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. అరుుతే కొద్దిసేపటికే ఆర్జేడీ శాసనసభాపక్ష నేత అబ్దుల్ బారి సిద్దిఖీతో కలిసి ఆరుగురు ఎమ్మెల్యేలు మీడియూతో మాట్లాడారు. ఆర్జేడీ నుంచి బయటికొచ్చి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసి తామెలాంటి లేఖపైనా సంతకాలు చేయలేదని వారు విలేకరులకు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో సావధాన తీర్మానం వంటి ఇతర ప్రయోజనాల కోసం ఆ సంతకాలు తీసుకున్నట్టు అబ్దుల్ గఫూర్ పేర్కొన్నారు. లలిత్‌యూదవ్, ఫయూజ్ అహ్మద్, దుర్గాప్రసాద్ సింగ్, చంద్రశేఖర్, ఇస్లాం సాహీన్‌లు ఆర్జేడీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. పార్టీలో చీలిక వార్తలను విన్నానని, ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నానని లాలూ ఢిల్లీలో విలేకరులకు చెప్పారు.

 బీజేపీతో పొత్తుకు ఎల్‌జేపీ సై!

 న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కారణంగా గతంలో ఎన్‌డీఏకి దూరమైన లోక్‌జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఇప్పుడు మళ్లీ బీజేపీతో ఎన్నికల పొత్తుకు ఆసక్తిగా ఉందనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఆ పార్టీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. గుజరాత్ మతఘర్షణలకు సంబంధించి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కోర్టులు క్లీన్‌చిట్ ఇచ్చిన తర్వాత ఇక సమస్యల్లేవని ఆయన సోమవారం నాడిక్కడ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. అయితే సీట్ల కేటాయిం పులో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఊగిసలాట ప్రదర్శించడంతో అసంతృప్తితో ఉన్న ఎల్‌జేపీ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోందని సమాచారం.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు