బిగ్ బాస్7లో సోఫియా హయత్ పై దాడి చేసిన కోహ్లీ అరెస్ట్!

17 Dec, 2013 01:19 IST|Sakshi
బిగ్ బాస్7 కార్యక్రమంలో పాల్గొన్న పాకిస్థాన్ కు చెందిన బ్రిటీన్ నటి సోఫియా హయత్ పై దాడి చేశారనే అరోపణలపై బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో 'బిగ్ బాస్ 7' కార్యక్రమం మరోసారి వివాదస్పదంగా మారింది. హయత్ చేసిన ఫిర్యాదు మేరకే లోనావాలా లోని బిగ్ బాస్ హౌజ్ నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ కార్యక్రమం నుంచి డిసెంబర్ 11 తేదిన హయత్ బయటకు వచ్చింది. ఆతర్వాత కోహ్లీపై శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 
 
బిగ్ బాస్ హౌజ్ లో తనను అసభ్య పదజాలంతో దూషించి.. కోహ్లీ తనపై చేయి చేసుకున్నాడని ఫిర్యాదులో హయత్ పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. హయత్ ఫిర్యాదు మేరకు అర్మాన్ కోహ్లీ, అరుణ్ చవాన్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఆతర్వాత ఫిర్యాదును లోనావాల పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశామని పోలీసులు వెల్లడించారు. కోహ్లీపై 324, 504, 509, 506, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ 7 కార్యక్రమంలో నాకు తనిషా, ఎజాజ్ ఖాన్ ల మధ్య గొడవ జరిగింది. అయితే ఆర్మాన్ కోహ్లీతో జరిగిన వాదన హింసాత్మకంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసుల స్పందించిన తీరు అమోఘం అని ట్విటర్ లో హయత్ పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు