బిల్‌గేట్స్.. ప్రపంచంలోనే అత ్యధిక ధనవంతుడు. ఆయన పుట్టిన రోజు నాడు ప్రపంచంలోని ఒక్కొక్కరికీ రూ. 650లు ఇచ్చినా.. ఆయన దర్జాగా, విలాసవంతమైన జీవితం గడపగలరట! ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ 80 బిలియన్ డాలర్స్ అంటే మన దేశ కరెన్సీ ప్రకారం రూ. 5,34,600 కోట్లకు పైమాటే. సెకనుకు ఆయన ఆర్జించే సంపాదన రూ. 10 వేల రూపాయలు. అయితే బిల్‌గేట్స్ తన ఆస్తులతో భారతీయులకు ఏమేం చేయగలరని పలు అంచనాలు వెలువడుతున్నాయి. బిల్‌గేట్స్ తన ఆస్తులతో బనారస్ ప్రజలందరికీ ఇళ్లు కొనగలరని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఒక్కో ఫ్లాట్ ధర రూ. 18-22 లక్షల వరకు ఉంటుంది.
30 లక్షల ఫ్లాట్స్‌ను కోటి 20 లక్షల మంది ప్రజలకు కొనివ్వగలరట. 0-9 ఏళ్ల మధ్య పిల్లలకు 10 నెలల వరకు క్యాండీస్‌ను నిరంతరాయంగా తినగలిగేటట్టు చేయగలరట. భారత జనాభా మొత్తానికి ఆహారం, టీ స్పాన్సర్ చేసినా.. ఆయన ఆస్తులు తరిగిపోవట. చండీగఢ్‌లో నివసించే 10.5 లక్షల ప్రజలకు ఒక్కొక్కరికీ రూ. 6.33 లక్షల విలువ చేసే బొలేరాను కొని గిఫ్ట్‌గా ఆయన ఇవ్వగలరట. మైక్రోసాఫ్ట్ స్థాపనతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగిన బిల్‌గేట్స్.. ఇప్పటికే ఎన్నో దానధర్మాలు చేస్తున్నారు. బిల్‌గేట్స్ తన భార్యతో కలసి ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, మూడో ప్రపంచ దేశాల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి ఉచిత విద్య వంటి వాటికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.