పార్లమెంటరీ స్థాయీ సంఘానికి 'జేఏసీ' బిల్లు

15 Sep, 2013 09:52 IST|Sakshi

న్యాయమూర్తుల నియామకాల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో జ్యుడీషియల్ నియామకాల కమిషన్ (జేఏసీ) ఏర్పాటుకు వెసులుబాటు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపారు. తదుపరి సంప్రదింపులు కోసం దీన్ని స్థాయి సంఘానికి అప్పగించారు. ప్రజలు, బిల్లుతో సంబంధం కలిగిన వారిని అభిప్రాయాలు, సలహాలను స్థాయీ సంఘం తీసుకోనుంది. ఈ బిల్లును ఆగస్టు 29న రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

జడ్జిల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం విధానాన్ని మార్చాల్సిందేనని రాజకీయ పార్టీలు పట్టుబడుతున్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులో జడ్జిల నియామకంలో ఏమాత్రం పారదర్శకత లేదని, న్యాయ వ్యవస్థలో బంధుప్రీతి కొనసాగుతూనే ఉందని, దీన్ని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు