‘సూపర్’ గ్రహాలపై జీవ సమ్మేళనాలు!

4 Jan, 2016 02:43 IST|Sakshi

మాస్కో: సౌర కుటుంబం అవతల సూపర్ ఎర్త్‌గా పిలిచే గ్రహాల (భూమికన్నా  ఐదు నుంచి పది రెట్లు పెద్దవి)పై జీవానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించే రసాయన సమ్మేళనాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మాస్కో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీ ఆఫ్ కంప్యూటర్ డిజైన్ హెడ్ ఆర్టెమ్ ఒగనోవ్ ఆధ్వర్యంలో ఈ అంశంపై పరిశోధన చేశారు.

‘సూపర్’ గ్రహాల్లో అత్యధిక పీడనం ఉంటుంది. దీంతో సిలికాన్, ఆక్సిజన్, మెగ్నీషియం మూలకాల మధ్య రసాయన చర్యలు జరిగి సమ్మేళనాలు ఏర్పాడతాయని, ఈ పరిస్థితులు జీవం మనుగడకు అనుకూల పరిస్థితిని కల్పిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు