జమ్మూలో తీవ్రవాదుల దాడి ఖండించిన బీజేపీ

26 Sep, 2013 11:29 IST|Sakshi

జమ్మూ కాశ్మీర్లో ఈ రోజు ఉదయం పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల జంట దాడులను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జావదేకర్ గురువారం న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భారత్లో తీవ్రవాద దాడుల ద్వారా పాక్ ప్రచ్ఛన్న యుద్దానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

 

పాక్ తన భూభాగంలో ఉండి భారత్పై తీవ్రవాదుల దాడికి ఉసిగొల్పుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలో తీవ్రవాదుల దాడుల జరగకుండ భారత ప్రధాని పార్లమెంట్ ఉభయ సభల ద్వారా ఇచ్చిన భరోసా గాలిలో దీపమైందని ఆయన అభివర్ణించారు. ఆ దాడులు అరికట్టేందుకు ప్రధాని కనీసం ఎటువంటి చర్యలు చేపట్టారనేది నేటిని అంతుపట్టని విషయంగా ఆయన వ్యాఖ్యానించారు.

 

జమ్ము కాశ్మీర్లోని కథువా జిల్లాలోని హీరా నగర్ పోలీసు స్టేషన్పై అలాగే సాంబ సెక్టార్ సైనిక శిబిరంపై తీవ్రవాదులు దాడి చేశారు. ఆ ఘటనలలో మొత్తం 9 మంది మరణించారు. వారిలో సైనిక అధికారి కూడా ఉన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న రెండు తీవ్రవాదుల దాడులను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు.

మరిన్ని వార్తలు