పార్టీని బీజేపీలో విలీనం చేస్తా:యాడ్యూరప్ప

2 Jan, 2014 21:11 IST|Sakshi

బెంగళూరు: తాను స్థాపించిన కేజేపీ(కర్ణాటక జనాతా పార్టీ)ని త్వరలో బీజేపీలో విలీనం చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు యాడ్యూరప్ప తెలిపారు. వచ్చే ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా యాడ్యూరప్ప నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలనే ఉద్దేశంతోనే తాను తిరిగి బీజేపీలోకి చేరుతున్నట్లు యాడ్యూరప్ప గతంలోనే స్ఫష్టం చేసిన సంగతి తెలిసిందే. యడ్యూరప్పను సాదరంగా ఆహ్వానించాలని బీజేపీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపింది. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి యడ్యూరప్ప శక్తియుక్తులను బీజేపీ వినియోగించుకోనుంది.

మరిన్ని వార్తలు