మహాకూటమిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

30 Oct, 2015 16:57 IST|Sakshi

న్యూఢిల్లీ: బిహార్ ప్రజలను మతప్రాతిపదికన విడగొట్టేందుకు మహా కూటమి ప్రయత్నిస్తోందని ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి నేతృత్వంలోని బీజేపీ నాయకులు శుక్రవారం ఈసీని కలిశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ నాయకులు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఈసీకీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ దివాళాకోరుతనంతో కొంత మంది నాయకులు హద్దులు దాటారని ఈసీని కలిసిన తర్వాత నఖ్వీ  విమర్శించారు.

మరిన్ని వార్తలు