యూపీలో బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది!

7 Jan, 2017 15:12 IST|Sakshi
యూపీలో బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది!
  • క్లియర్‌ మెజారిటీ సమాజ్‌వాదీ పార్టీకే
  • బీఎస్పీ కన్నా బీజేపీకి తక్కువ స్థానాలు వస్తాయ్‌
  • జస్టిస్‌ మార్కండేయ కట్జూ విశ్లేషణ
  • న్యూఢిల్లీ: రానున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ చిత్తుగా జోడిపోతుందని  సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ మార్కండేయ కట్జూ జోస్యం చెప్పారు. యూపీ ఎన్నికల్లో సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆయన అంచనా వేశారు. ఎస్పీకి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చినా ఆశ్చర్యపోవడానికి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కన్నా తక్కువ సీట్లు వస్తాయని ఆయన అన్నారు.

    రానున్న యూపీ ఎన్నికలను విశ్లేషిస్తూ కట్జూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. 'యూపీ సహా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు కులం, లేదా మత ప్రాతిపదికన జరుగుతాయి. ఏదైనా ప్రభంజనం ఉంటే అందుకు మినహాయింపు ఇవ్వవచ్చు. ఉదా: 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం నడిచింది. ఇప్పుడు యూపీలో ఎలాంటి గాలి వీయడం లేదు. కాబట్టి దాదాపుగా 90శాతం ఓటింగ్‌ కులం, మతం ఆధారంగా నమోదవుతుంది. ప్రభంజనం కోసమే పెద్దనోట్లను రద్దు చేసినప్పటికీ అది విజయవంతంకాలేదు. నిజానికి నోట్ల రద్దు వల్ల బీజేపీకి హాని జరిగే అవకాశముంది. ఈ నిర్ణయం వల్ల సామాన్యులు, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, రైతులు బాగా దెబ్బతిన్నారు' అని కట్జూ పేర్కొన్నారు.
     

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా