రాజుల కోటలో కాషాయ రెపరెపలు

8 Dec, 2013 13:24 IST|Sakshi
రాజుల కోటలో కాషాయ రెపరెపలు

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. మెజారిటీ స్థానాలు గెల్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే అధికార కాంగ్రెస్కు ప్రతిపక్ష  హోదా కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. మధ్యాహ్నం 1 గంటకు అందించిన వివరాల ప్రకారం బీజేపీ మూడు స్థానాలు గెలిచింది. 143 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 28 సీట్లలో లీడింగ్లో కొనసాగుతోంది.

నేషనల్ పీపుల్స్ పార్టీ 9, స్వతంత్ర అభ్యర్థులు 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. గంగాధర్ సాదుల్షహర్, పింద్వారా-అబూ, రియోడర్(ఎస్సీ) స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. తమ పార్టీ విజయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సీఎం అశోక్ గెహ్లట్, బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధరా రాజే తమ తమ స్థానాల్లో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు