తెలంగాణ బిల్లు పాసయ్యేలా బీజేపీ ఒత్తిడి తెస్తుంది: నాగం

13 Dec, 2013 20:50 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్ర విభజనపై తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో బీజేపీ నేతలతో  ఏర్పాటు చేసిన తెలంగాణ జేఏసీల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వచ్చేలా బీజేపీ ఒత్తడి తేవాలని కోరుతూ తెలంగాణ జేఏసీ, బీజేపీ నేతలకు వినతి సమర్పించినట్టు చెప్పారు. 

 

ప్రత్యేక సమావేశాలు పెట్టించైనా సరే..  తెలంగాణ బిల్లు పాసయ్యేలా బీజేపీ ఒత్తడి తెస్తుందని నాగం జనార్థన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు