కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఘోరప్రమాదం

20 Sep, 2017 16:51 IST|Sakshi
కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఘోరప్రమాదం

- టన్నెల్‌లో పేలుడు.. ఏడుగురు కూలీల మృతి

సాక్షి, ఇల్లంతకుంట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద ప్రాజెక్టు టన్నెల్‌ మార్గంలో బుధవారం పని జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రాణహిత-చేవేళ్ల 10 వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ పనుల వద్ద ఎయిర్ బ్లాస్టింగ్‌ జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

అప్‌డేట్స్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు టన్నెల్‌లో పేలుడు ఘటనలో గాయపడి కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5:30కు మరో కూలీ చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. చికిత్స పొందుతున్నవారిలో మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు