దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ

3 Aug, 2016 13:56 IST|Sakshi

మ్యూనిచ్ : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీసంస్థ బీఎండబ్ల్యూ గ్రూపు రెండో త్రైమాసికంలో భళా అనిపించింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో అమ్మకాల వాల్యుమ్, నికరలాభాల్లో బెస్ట్ క్వార్టర్గా నిలిచింది. మంగళవారం ప్రకటించిన బీఎండబ్ల్యూ రెండో త్రైమాసిక ఫలితాల్లో ఈ గ్రూపు అమ్మకాల వాల్యుమ్ 5.7 శాతం ఎగిసి, 6,05,534 యూనిట్లగా నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. సగం ఏడాదిలో విక్రయాలు గరిష్ట స్థాయికి చేరుకుని, 11,63,139 యూనిట్లను విక్రయించినట్టు వెల్లడించింది. యేటికేటికీ ఈ వృద్ధి 5.8 శాతమని జిన్హువా వార్తా ఏజెన్సీ రిపోర్టులో తెలిపింది.

రెవెన్యూ సైతం 4.5 శాతం పెరిగి, 28 బిలియన్ డాలర్లుగా నమోదుచేసింది. ఆరు నెలల రెవెన్యూ 2.3 శాతం ఎగిసి, 46 బిలియన్ యూరోలుగా రికార్డుచేసింది. ముందటి కంటే ఈ త్రైమాసికంలో ఎక్కువకార్లను విక్రయించి, రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించామని బోర్డు మేనేజ్మెంట్ చైర్మన్ హెర్లాడ్ క్రుగేర్ తెలిపారు. లాభాల వృద్ధిని పెంచుకోవడంతో పాటు తమ ప్రణాళికలను స్టెప్ బై స్టెప్ అమలుచేస్తామని ఆయన ప్రకటించారు.

మరిన్ని వార్తలు