బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెంపు

27 Nov, 2013 01:03 IST|Sakshi
బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెంపు

న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ కార్ల ధరలు జనవరి నుంచి 10 శాతం వరకూ పెరుగుతాయి. నిలకడైన లాభదాయక వృద్ధి సాధించే వ్యూహంలో భాగంగా ధరలను పెంచుతున్నామని బీఎం డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సహర్ మంగళవారం తెలిపారు. బీఎండబ్ల్యూ , మినీ కార్ల ధరలను 7-10% వరకూ పెంచుతామని చెప్పారు. అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి, ధరలను పెంచుతున్నామని, ఈ ధరల పెంపు దీర్ఘకాలంలో మంచి ఫలితాలనిస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. రూపాయి పతనం కారణంగా ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ కార్ల ధరలను 5% వరకూ పెంచింది. ప్రస్తుతం ఈ కంపెనీ భారత్‌లో 1 సిరీస్, 3,5,6,7 సిరీస్ కార్లను, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5 ఎస్‌యూవీలను, ఎం సిరీస్ స్పోర్ట్స్ కార్లను, మిని సిరీస్ కార్లను విక్రయిస్తోంది. ఈ కార్ల ధరలు రూ.20.9 లక్షల నుంచి రూ.1.78 కోట్ల రేంజ్‌లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు