పడవ బోల్తా: 18 మంది గల్లంతు

11 May, 2014 09:07 IST|Sakshi

ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ ప్రాంతంలోని దిహత్ కొత్వాలీ వద్ద గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఆ ప్రమాదంలో18 మంది గల్లంతయ్యారు. మరో ఎనిమిది మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.

 

నివాడియా ఘాట్ వద్ద నుంచి నిన్న సాయంత్రం  26 మందితో పడవ బయలుదేరిందని, బయలుదేరిన కొద్ది సేపటికే పడవ బోల్తా పడిందని చెప్పారు. నీటిలో మునిగిన 8 మంది మాత్రం ఈదుకుంటు ఒడ్డుకు చేరుకున్నారని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులు పడవలోకి ఎక్కడం వల్లే ఆ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు