యథాతథంగా జపాన్ కీలక వడ్డీరేట్లు

1 Nov, 2016 16:58 IST|Sakshi
యథాతథంగా జపాన్ కీలక వడ్డీరేట్లు

టోక్యో: జపాన్ కేంద్ర బ్యాంకు బ్యాంక్ ఆఫ్  జపాన్ (బీఓజే)  కీలక వడ్డీరేట్ల నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న మైనస్ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు  ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలకనుగుణంగానే -0.1శాతం స్వల్ప-కాల వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించింది. దీంతోపాటుగా  2017, 2018  ఆర్థిక సంవత్సరాలకు గాను స్థిరమైన విధానం అమలుతో పాటు ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని  మరింత పొడిగించింది. విదేశాలనుంచి  డిమాండ్  క్షీణత తోపాటు, ప్రజల ఆర్థిక కార్యకలాపాల బలహీనత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ కొనసాగుతుందనిపేర్కొంది. ప్రస్తుత మందకొడితనం స్వల్పంగా మెరుగుపడి ఎగుమతులు, వినియోగం  మధ్యస్తంగా  పెరగనుందని అంచనావేసింది 

అలాగే ప్రస్తుతం అమలు చేస్తున్న స్టిములస్‌ ప్యాకేజీకి  అదనపు సహాయక ప్యాకేజీలను ప్రకటించలేదు.  దీంతో సెక్యూరిటీల కొనుగోలు ద్వారా దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థకు 800 బిలియన్‌ యెన్‌ల (625 బిలియన్   పౌండ్లు)నిధులను  యథాతథంగా ఉండనున్నాయి.
గత పాలసీ రివ్యూలో  దాదాపు 10 సంవత్సరాల  దీర్ఘకాల ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేయడానికి,  తద్వారా సున్నా శాతంగా  ఉన్న ద్రవ్యోల్బణాన్నిఅధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 

మరిన్ని వార్తలు