జపాన్ కేంద్ర బ్యాంక్ కీలక నిర్ణయం

21 Sep, 2016 11:02 IST|Sakshi
జపాన్ కేంద్ర బ్యాంక్ కీలక నిర్ణయం

టోక్యో: జపాన్ బ్యాంక్  తన ద్రవ్య పరపతి విధానంలో ఊహించని నిర్ణయం తీసుకుంది . ప్రస్తుతం అమల్లో ఉన్న నెగిటివ్ ఇంటరెస్ట్ రేటును యథాతథంగా అమలు చేసేందుకు  బుధవారం నిర్ణయించింది.  మంగళవారం మొదలైన రెండు రోజుల బీవోజే  పరపతి సమీక్ష  సమావేశంలో ప్రస్తుత -0.1 శాతం చొప్పున అమలు చేయడానికి నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా 2 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.  "ఈల్డ్ కర్వ్ కంట్రోల్"  పథకం కింద దాదాపు 10 సంవత్సరాల  దీర్ఘకాల ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేయడానికి,  తద్వారా సున్నా శాతంగా   ఉన్న ద్రవ్యోల్బణాన్నిఅధిగమించాలని యోచిస్తోంది.

అలాగే ప్రస్తుతం అమలు చేస్తున్న స్టిములస్‌ ప్యాకేజీకి అదనంగా మరింత  భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించింది.  సెక్యూరిటీల కొనుగోలు ద్వారా ప్యాకేజీని అమలు చేయనుంది. భారీ ఉద్దీపన కార్యక్రమం కింద సమగ్ర  దీర్ఘకాలిక వడ్డీ రేట్లు లక్ష్యంగా  స్వీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థకు 800 బిలియన్‌ యెన్‌ల నిధులను ఫిక్స్‌డ్‌ రేటుకే అందించేందుకు నిర్ణయించింది.  
మరోవైపు  బీవోజే కీలక నిర్ణయం నేపథ్యంలో డాలరు మారకపు  విలువతో పోలిస్తే  జపనీస్‌ కరెన్సీ యెన్‌ కోలుకుంది.  దాదాపు 2 శాతానికి  పైగా లాభపడింది.
 

మరిన్ని వార్తలు