అర్ధరాత్రి బుడ్డోడి సాహసం; వైరల్‌ వీడియో

28 May, 2017 14:43 IST|Sakshi
అర్ధరాత్రి బుడ్డోడి సాహసం; వైరల్‌ వీడియో
హైదరాబాద్‌: అర్ధరాత్రి. సమయం 12:40. చిన్నారులు పూజ- చందులు చేతిలో చెయ్యివేసుకుని చిన్న గల్లీలోకి ఎంటర్‌ అయ్యారు. కొద్ది దూరం నడిస్తే ఇల్లొచ్చేస్తుంది. కానీ అంతలోనే ఓ వీధికుక్కల గుంపు వారికేసి గుర్రుమంది. ప్రమాదాన్ని పసిగట్టిన పూజ.. క్షణంలో పారిపోయింది. చందుకు మాత్రం కుక్కలు ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. దూసుకొచ్చి చుట్టుముట్టాయి.
 
పెద్దవాళ్లుసైతం గజగజా వణికిపోయే ఆ పరిస్థితిలో చందూ సాహసం ప్రదర్శించాడు. కుక్కలను ఎదిరించి సురక్షితంగా బయటపడగలిగాడు. హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో శనివారం రాత్రి చోటుచేసుకున​ ఈ సంఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయింది.
 
మూసాపేట్‌లోని శ్రీకాకుళం బస్తీలో శనివారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. పెళ్లింటి నుంచి రెండు వీధుల అవతలుండే సొంతింటికి వెళ్లే క్రమంలో చందు, పూజలు ఇలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వీధికుక్కల నుంచి రక్షణకల్పించాల్సిందిగా స్థానికులు పలుమార్లు వేడుకున్నా అధికారులు స్పందిచడంలేదు.
మరిన్ని వార్తలు