పరీక్ష రాస్తున్న నేహా వద్దకు వచ్చి..!

21 Jul, 2016 17:26 IST|Sakshi
పరీక్ష రాస్తున్న నేహా వద్దకు వచ్చి..!

అలీగఢ్ (ఉత్తరప్రదేశ్): వర్షకాలం కావడంతో వాతావరణం కొంచెం చినుకులతో చల్లగా ఉంది. అలీగఢ్‌ సమీపంలోని తపాల్‌లో ఉన్న డీడీఎస్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్నారు. 17 ఏళ్ల నెహా శర్మ తరగతి గదిలో కూర్చొని.. తన సమాధానపత్రాన్ని నింపుతోంది. ఇంతలోనే ఓ 18 ఏళ్ల యువకుడు వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఏం జరగుతున్నది అంటూ టీచర్, మిగతా ఉపాధ్యాయులు వారి వంక ఆసక్తిగా చూశారు. వారు స్పందించేలోపే ఆ యువకుడు తుపాకీ తీసి నేరుగా నెహా తలకు గురిపెట్టి పేల్చాడు. తూటా తలలోంచి దూసుకుపోవడంతో పరీక్ష రాస్తున్న నేహా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

ఈ షాక్‌లోంచి తేరుకునే లోపే ఆ యువకుడు తనను తాను కాల్చుకున్నాడు. టీచర్ దిగ్భ్రాంతి చెందింది. రక్తపు మడుగులో ఉన్న ఆ ఇద్దరిని చూసి విభ్రమ చెందిన విద్యార్థులు హాహాకారాలు చేస్తూ బయటకు పరిగెత్తారు. గురువారం జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ను కుదిపేస్తున్నది. ఓ యువకుడు డిగ్రీ విద్యార్థినిని తరగతి గదిలోనే కాల్చి చంపి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిని 18 ఏళ్ల సందీప్‌ మలాన్‌గా గుర్తించారు. అతను స్థానిక వెటర్నరీ వైద్యుడి కొడుకు. నెహా, సందీప్‌ ఒకరికొకరు తెలుసునని విద్యార్థులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్న పోలీసులు ప్రేమ వ్యవహారం ఇందుకు కారణం కాదని చెప్తున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?

‘వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేస్తా..’

నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం

నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్‌’

మాకు పది లక్షల విరాళం