‘బ్రహ్మోస్’ పరీక్ష సక్సెస్

7 Feb, 2014 03:57 IST|Sakshi
‘బ్రహ్మోస్’ పరీక్ష సక్సెస్

న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి మరోసారి సత్తా చాటింది. తొలిసారిగా సాల్వో మోడ్ (ఒకేసారి సమాంతరంగా క్షిపణులను ప్రయోగించడం) పద్ధతిలో నిర్వహించిన పరీక్షలో కూడా ఈ క్షిపణి విజయం సాధించింది. అరేబియా సముద్రంలో నేవీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ త్రిఖండ్‌పై నుంచి రెండు క్షిపణులతో నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైందని గురువారమిక్కడ డీఆర్‌డీవో అధికారులు వెల్లడించారు.

 

భవిష్యత్తులో ఒకేసారి ఎనిమిది క్రూయిజ్ క్షిపణులను కూడా ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఘన, ద్రవ ఇంధనంతో నడిచే బ్రహ్మోస్ క్షిపణిని సైన్యం, నేవీల్లో ఇదివరకే ప్రవేశపెట్టారు. ఇది 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. వాయుసేనలో ప్రవేశపెట్టనున్న బ్రహ్మోస్ వెర్షన్‌కు తుది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇండో-రష్యన్ కంపెనీ బ్రహ్మోస్ ఏరోస్పేస్ దీనిని అభివృద్ధిపర్చింది.

మరిన్ని వార్తలు