ఆ గాలి పీల్చితే 40 సిగరెట్లు కాల్చినంత!

4 Nov, 2016 12:12 IST|Sakshi
ఆ గాలి పీల్చితే 40 సిగరెట్లు కాల్చినంత!
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మరింత దారుణంగా ఉంది. దివాలి అనంతరం ఢిల్లీలో కమ్ముకున్న కాలుష్య పొగలు, ఇప్పటికీ వదలడం లేదు. రాజధానిని, దాన్ని పరిసర ప్రాంతాలను మరింత అతలాకుతలం చేస్తున్నాయి. గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యంత అధ్వానమైన పరిస్థితిని ఢిల్లీ ఎదుర్కొంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ గాలి పీల్చడం ఒక్క రోజులో 40 సిగరెట్లు స్మోక్ చేసినంతకు సమానమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
వెంటనే గాలిని శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 200 పైగా పిటిషన్లు నమోదయ్యాయి..  భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గణాంకాల బట్టి గురువారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో దట్టమైన కాలుష్యం, పొగమంచు కారణంగా విజిబిలిటీ 400 నుంచి 500 మీటర్స్గా ఉంది. 
 
గుండె, శ్వాసకోశ  సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని రక్షించడానికి వెంటనే ఎమర్జెన్సీ చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని సెంటర్ ఫర్ సైన్సు అండ్ ఎన్విరాన్మెంట్ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలను ఇళ్లనుంచి బయటకు రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.  అసలకే వాహన కాలుష్యం దీనికి తోడు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వంటి ప్రాంతాల్లో ఎడతెగకుండా వరికుంచెలు తగులబెట్టడం, దివాలి బాణాసంచా కాల్చడం వంటివి కాలుష్య పొగలను అసాధారణ స్థాయిలకి తీసుకెళ్లాయని నిపుణులు పేర్కొంటున్నారు.
 
దివాలి అనంతరం వరి కుంచెలను కాల్చడం మరింత ఎక్కువైందని నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ శాటిలైట్ ఫోటోలు తెలుపుతున్నాయి. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకుని, ఢిల్లీలో గాలి శుభ్రతకు పరిష్కరం కనుగొనాలని, 200 పైగా పిటిషన్లు నమోదయ్యాయని చేంజ్.ఆర్గ్ పేర్కొంది. 24 గంటల్లోనే ఇన్ని పిటిషన్లు నమోదైనట్టు తెలిపింది.  సమర్థవంతమైన కాలుష్య ఉపశమన పథకాలు ఢిల్లీకి కావాలని, తక్షణం చర్యలు తీసుకోకపోతే, ఈ శీతాకాలంలో పొగమంచుతో పాటు కాలుష్యం మరింత పెరిగి, ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 
మరిన్ని వార్తలు