అధ్యక్షులందరూ గోవాకు వచ్చేశారు!

15 Oct, 2016 13:56 IST|Sakshi
అధ్యక్షులందరూ గోవాకు వచ్చేశారు!
పనాజీ : నేటి నుంచి గోవాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆయా దేశాల అధినేతలందరూ భారత్ కు  విచ్చేశారు. భారత్ అధ్యక్షతన శని, ఆది వారాల్లో ఈ సదస్సు జరుగుతోంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. మొదట ఈ సదస్సుకు హజరయ్యేందుకు  దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకుబ్ జుమా గోవాకు చేరుకోగా, అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమర్లు దాబోలిమ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా రాత్రి 1 గంటలకు గోవాకు రావాల్సిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆలస్యంగా ఉదయం 10 గంటల ప్రాంతంలో దాబోలిమ్ విమానశ్రయానికి వచ్చారు. అనంతరం చైనా అధ్యక్షుడు క్సి జిన్పింగ్ మధ్యాహ్నం 12 గంటల తర్వాత గోవాకు చేరుకున్నారు. కాగ, భారత్ అధ్యక్షతన  ఈ సదస్సు జరుగుతుండటంతో నిన్న రాత్రే ప్రధాని నరేంద్రమోదీ గోవా వెళ్లారు.  ఆయా దేశాల అధినేతలకు భారత ప్రతినిధులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ సదస్సు కోసం భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుచేసింది.
 
అనుకున్న మాదిరిగానే బ్రిక్స్ సదస్సు ప్రారంభమయ్యే ముందు భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. డిఫెన్స్, ఎనర్జీ, అగ్రికల్చర్ వంటి వ్యాపార సంబంధాలపై ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఉగ్రవాదాన్ని కూడా ప్రధాన అజెండాగా తీసుకుని పుతిన్తో ప్రధాని చర్చించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అనంతరం చైనా అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ అవుతారు. చైనా అధ్యక్షుడి రాకతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాయని మోదీ ట్వీట్ చేశారు. 
మరిన్ని వార్తలు