రూపాయి విలువ తెలుసా?

15 Sep, 2017 17:34 IST|Sakshi
రూపాయి విలువ తెలుసా?

న్యూఢిల్లీ: అఖిల భారత అన్నా డీఎంకే వ్యవస్థాపక నాయకుడు ఎంజీ రాంచంద్రన్‌ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వంద రూపాయలు, ఐదు రూపాయల నాణాలను తీసుకొస్తున్న విషయం తెల్సిందే. మన కరెన్సీ నాణాలకు 67 ఏళ్ల చరిత్ర ఉంది. మొట్టమొదటి సారిగా స్వాతంత్య్రానంతరం 1950, ఆగస్లు 15వ తేదీనా భారత నాణాలను తీసుకొచ్చారు.

అప్పటి వరకు బ్రిటీష్‌ ఇండియన్‌ కరెన్సీపై నున్న బ్రిటిష్‌ రాజు బొమ్మను తొలగించి నాలుగు సింహాలు, అశోక చక్రం ముద్రతో మొదటి భారత రూపాయి బిళ్లను దేశంలో ప్రవేశ పెట్టారు. అప్పట్లో రూపాయి అంటే సరిగ్గా దాని విలువ వంద పైసలు ఉండేది కాదు. రూపాయి అంటే అరు అణాలు, 64 పైసలు ఉండేది. ఒక దశలో అది 182 పైసలకు కూడా వెళ్లింది. ఒకప్పుడు భారత నాణాలను సిల్వర్, కాపర్, నికిల్‌ ఏదో ఒక లోహాన్ని ఉపయోగించి నాణాలను తయారు చేయగా ఆ తర్వాత రెండేసి లోహాలను ఉపయోగించి నాణాలను తయారు చేయడం ప్రారంభమైంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న నాణాలను హస్త ముద్ర సిరీస్‌ కింద 2007లో తీసుకొచ్చారు. అందులోనే కొత్త సీరిస్‌ను 2011లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఎంజీ రామచంద్రన్‌ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 17వ తేదీన తీసుకరానున్న ఐదు, వంద రూపాయల నాణాలను సిల్వర్, కాపర్, నికిల్‌తోపాటు జింక్‌ను కూడా కలిపి తీసుకొస్తున్నారు.
 

మరిన్ని వార్తలు