అంతరిక్షం నుంచి తొలిసారి లైవ్ షో

11 Jan, 2014 15:11 IST|Sakshi

ప్రపంచంలో తొలిసారిగా అంతరిక్షంలో లైవ్ షో నిర్వహించనున్నట్లు బ్రిటన్కు చెందిన ఛానెల్ 4 శనివారం లండన్లో వెల్లడించింది. అంతరిక్షంలోని అంతర్జాతీయ కేంద్రం చుట్టు తిరుగుతూ ఈ లైవ్ షోను నిర్వహిస్తామని తెలిపింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయని పేర్కొంది.

 

లైవ్ ఫ్రమ్ స్పేస్ పేరిట నిర్వహించే లైవ్ షోను నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ద్వారా 170 దేశాల్లో ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. బ్రిటన్ టాలెంట్ సెర్చ్ కార్యక్రమం 'ది ఎక్స్ ఫ్యాక్టర్' వ్యాఖ్యాతగా వ్యవహరించిన డెర్మట్ ఒ లిరి ఈ  కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యహరిస్తారని చెప్పింది. హ్యూస్టన్లోని నాసా మిషన్ చెందిన వ్యోమగాములతో ఆయన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో భాగంగా మాట్లాడతారని వివరించింది.

>
మరిన్ని వార్తలు