ఓలా, ఉబర్ ఆగడాలకు ఇక చెక్

4 Aug, 2016 12:32 IST|Sakshi
ఓలా, ఉబర్ ఆగడాలకు ఇక చెక్

దేశవ్యాప్తంగా ప్రైవేట్ క్యాబ్ల దోపిడీకి ఇక చెక్ పడనుంది. ట్యాక్సీ అగ్రిగేటర్లు ఉబర్, ఓలాలను మోటార్స్ వెహికిల్స్ యాక్ట్ పరిధిలోకి తీసుకురావడానికి రూపొందించిన డ్రాప్ట్ చట్టానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ డ్రాప్ట్ ప్రకారం లైసెన్సింగ్ నిబంధనలు అతిక్రమించిన వారికి లక్ష రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. దేశమంతటా ఒకేవిధమైన డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది. జువనైల్స్ ఎవరైనా ఈ తప్పిదాలకు పాల్పడితే, కారు ఓనర్స్కు లేదా గార్డియన్స్కు ఈ నేరాల కిందకు వచ్చేలా డ్రాప్ట్ను ప్రభుత్వం రూపొందించింది.

ఈ నేరాలకు రూ.25వేల జరిమానాతో పాటు మూడేళ్ల శిక్షను వారు అనుభవించాల్సి ఉంటుంది. జువనైల్స్ను జువనైల్ జస్టిస్ యాక్ట్ కిందకు తీసుకొచ్చి, వారి వెహికిల్ రిజిస్ట్రేషన్ ప్రభుత్వం రద్దు చేయనుంది. అదేవిధంగా మోటార్ వెహికిల్స్(సవరణ) బిల్లు 2016ను కూడా కేబినెట్ ఆమోదించింది. ఈ సవరణ బిల్లుతో రాష్ట్ర ప్రభుత్వాలు 10 టైమ్స్ ఎక్కువగా జరిమానాను విధించే అవకాశముంటుంది. ఒకవేళ రోడ్డు ప్రమాదాల వల్ల ఎవరైనా మరణిస్తే, హిట్ అండ్ రన్ కేసు బాధితులకు రూ.10లక్షల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

అన్ని ట్రాన్స్పోర్ట్ వాహనాలకు 2018 అక్టోబర్ 18 నుంచి ఆటోమేటిక్ గా ఫిటినెస్ టెస్టింగ్ కచ్చితంగా కలిగి ఉండేలా ఈ బిల్లు ప్రతిపాదించింది. సేఫ్టీ, ఎన్విరాన్ మెంట్ రెగ్యులేషన్స్ను అతిక్రమిస్తే కూడా పెనాల్టీలు విధిస్తామని రోడ్డు ట్రాన్స్పోర్ట్ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. సురక్షితమైన, ప్రజాహితమైన ప్రజారవాణా వ్యవస్థకు ఇతర పార్టీలన్నీ మద్దతు పలకాలని ఆయన కోరారు.

>
మరిన్ని వార్తలు