నిర్మలా సీతారామన్ తేల్చేశారు

24 Nov, 2016 14:49 IST|Sakshi
నిర్మలా సీతారామన్ తేల్చేశారు

న్యూఢిల్లీ: పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పూర్తి నిషేధానికి మంత్రిత్వ శాఖ  సన్నద్ధమవుతోంది. పరిశ్రమలు, వాణిజ్య  శాఖామంత్రి నిర్మలా సీతారామన్  వేగంగా పావులు కదుపుతున్నారు.  దీనికి సంబంధించిన ప్రతిపాదననుక్యాబినెట్ ఆమోదం కోసం పంపించారు.   పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిషేధ ప్రతిపాదనను కేబినెట్ పరిశీలనకు  పంపినట్టు కేంద్రమంత్రి తెలిపారు.  ఈ రంగలో ఎఫ్ డీఐ లను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకోవడంలేదని పీటీఐకిచెప్పారు.

 పొగాకు ఉత్పత్తుల నియంత్రణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ  నిబంధనలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ఆమె చెప్పారు.  సిగరెట్లు, తదితర పొగాకు  ఉత్పతులను ప్రోత్సహించదలుచుకోలేదన్నారు.  ఈ నిర్ణయం పాక్షికంగా  రైతులపై ప్రభావం చూపించనున్నప్పటికీ, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టనున్నట్టు చెప్పారు.  మరోవైపు  ఎఫ్ డీఐల  నిషేధంపై కేంద్రమంత్రి  స్పష్టత ఇవ్వడంతో  మార్కెట్ లో  పొగాకు సంబంధిత షేర్లు నష్టాలనెదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఐటీసీ,  గోల్డెన్ టుబాకో తదితర షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
 

మరిన్ని వార్తలు