కాల్స్ డ్రాప్స్పై చేతులెత్తేసిన ప్రభుత్వం

25 Nov, 2016 20:13 IST|Sakshi
కాల్స్ డ్రాప్స్పై చేతులెత్తేసిన ప్రభుత్వం
కాల్స్ డ్రాప్స్ సమస్యతో ఓవైపు కస్టమర్లు సతమతమవుతుంటే, ఆ సమస్యను పూర్తిగా నిర్మూలించలేమని కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొనే సమస్యగా పేర్కొన్న కేంద్రం టెలికాం నెట్వర్క్లో కాల్డ్రాప్స్పై పూర్తిగా పరిష్కరించలేమంటూ శుక్రవారం వెల్లడించింది. బలహీనమైన రేడియో కవరేజ్, రేడియో ఇంటర్ఫియరెన్స్, అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్ లోడింగ్, ట్రాఫిక్ తీరులో మార్పులు, పవర్ ఫెయిల్యూర్స్తో సైట్లు మూత వంటి  వివిధ కారణాల చేత కాల్డ్రాప్స్ ఏర్పడతాయని టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభ్యకు శుక్రవారం తెలిపారు.
 
ఈ కారణాలచే ప్రతి వైర్లెస్ నెట్వర్క్ల్లో కాల్ డ్రాప్స్ సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని, టెలికాం ఆపరేటర్లు కాల్ డ్రాప్ సమస్యను గుర్తించి, వారి పరిమిత స్థాయిలో తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు. కానీ పూర్తిగా మాత్రం నిర్మూలించలేమని చెప్పారు.    
 
మరిన్ని వార్తలు