కంబోడియాలో తల్లిపాల ఎగుమతిపై నిషేధం

21 Mar, 2017 08:36 IST|Sakshi

పెనోంపెన్‌: కంబోడియా తల్లులనుంచి సేకరించిన పాలను ఎగుమతి చేస్తున్న ఓ కంపెనీ కార్యకలాపాలను ఆ దేశం తాత్కాలికంగా స్తంభింపజేసింది. కొంతమంది నిరుపేద మహిళలు తమ బిడ్డలకు ఇవ్వాల్సిన పాలను అమ్ముకుని జీవనానికి అవసరమైన డబ్బును సమకూర్చుకుంటున్నారని కొన్ని నివేదికలు పేర్కొనడంతో అక్కడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికాకు చెందిన ఆంబ్రోసియా ల్యాబ్స్‌ అనే కంపెనీ కాంబోడియాలో మహిళల నుంచి పాలను సేకరించి.. ఘనీభవింపజేసి, అమెరికాకు తరలించి విక్రయిస్తోంది. 147 మిల్లీ లీటర్ల పాల ప్యాకెట్‌ను 20 డాలర్లకు (రూ.1,300) విక్రయిస్తోంది. తమ బిడ్డలకు తల్లి పాలు ఇవ్వలేని అమెరికా మహిళలు వీటిని కొంటున్నారు.  ఈ కంపెనీ కాంబోడియా తల్లులకు రోజుకు దాదాపు రూ.500 చెల్లించేది. ఆసియాలోనే అతి పేద దేశాల్లో కాంబోడియా ఒకటి.

>
మరిన్ని వార్తలు