సౌండే కాదు.. స్పీకరూ కనిపించదు..

6 Feb, 2014 05:45 IST|Sakshi
సౌండే కాదు.. స్పీకరూ కనిపించదు..

ధ్వని వినిపిస్తుంది.. కనిపించదు.. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే, ఇక్కడ స్పీకర్ కూడా కనిపించదు. అయితే, ఇక్కడ పారదర్శక అద్దంలా కనిపిస్తోందే.. అదే స్పీకర్. ఈ అదృశ్య స్పీకర్‌ను అమెరికాకు చెందిన క్లియర్ వ్యూ ఆడియో సంస్థ తయారుచేసింది. ఈ వైర్‌లెస్ స్పీకర్‌ను ఏదైనా ట్యాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. సాధారణ స్పీకర్ల మాదిరిగా కాకుండా ఇది ప్రత్యేకమైన ఎడ్జ్ మోషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది.
 
  మామూలు కోన్ స్పీకర్లలో వెనక నుంచి ముందుకు కదలికలు సృష్టించడం ద్వారా ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ మాత్రం పీజోఎలక్ట్రిక్ యాక్టువేటర్స్ పారదర్శకంగా ఉండే ఆక్రలిక్ గ్లాస్ స్టీరియో ట్రాన్స్‌డ్యూసర్స్‌ను పక్క నుంచి ప్రేరేపిస్తాయి. ఈ ట్రాన్స్‌డ్యూసర్లు చాలా పలుచగా, కనిపించకుండా ఉన్నా.. ధ్వనిని మాత్రం బాగా ఉత్పత్తి చేస్తాయి. వచ్చే నెలలో ఇది మార్కెట్లోకి రానుంది. ధర రూ.22 వేలు.

మరిన్ని వార్తలు