ఎఫ్‌ఏటీసీఏ కేసుల కోసం ప్రత్యేక కమిటీ

13 Jul, 2015 09:03 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికాతో  కుదుర్చుకున్న విదేశీ ఖాతాల పన్ను వర్తింపు చట్టం(ఎఫ్‌ఏటీసీఏ) ఒప్పందం ప్రకారం కీలకమైన పన్నుల సమాచారానికి రక్షణ కల్పించడానికి, నల్లధనానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ).. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కమిటీ(ఐఎస్‌సీ) పేరుతో కమిటీని ఏర్పాటు చేసింది.

జూలై 9న ఈ ఒప్పందంపై సంతకం చేసేందుకు కొద్దిరోజుల ముందే సీబీడీటీ.. ఈ ప్యానెల్‌లో సభ్యుల సంఖ్యను ఎనిమిది మందికి పెంచింది. ఈ కమిటీకి ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శి హోదా కలిగి సీబీడీటీలో సభ్యుడుగా ఉన్న వ్యక్తి నేతృత్వం వహిస్తారు. ఐఎస్‌సీలోని ముగ్గురు జాయింట్ సెక్రెటరీ ర్యాంకు అధికారులు విదేశీ పన్నుల సమాచార వ్యవహారాలు చూస్తారు.

మరిన్ని వార్తలు