లంచం కేసులో సెన్సార్ బోర్డు అధికారి అరెస్టు

19 Aug, 2014 16:02 IST|Sakshi
లంచం కేసులో సెన్సార్ బోర్డు అధికారి అరెస్టు

న్యూఢిల్లీ: అవినీతి కేసులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్  సీఈఓ రాకేశ్ కుమార్‌ను సీబీఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక ప్రాంతీయ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రాకేశ్ కుమార్ రూ. 70 వేలు డిమాండ్ చేశారని, ఆయన ఏజెంట్లు ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని సీబీఐ అధికారులు తెలిపారు. సీఈఓను, ఆ ఏజెంట్లను మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. బాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖ నిర్మాతలు కూడా తమ సినిమాల సెన్సార్ సర్టిఫికెట్ల కోసం కుమార్‌కు లంచం ఇచ్చినట్లుగా తమ దగ్గర సమాచారం ఉందని వారు వెల్లడించారు.

 

రాకేశ్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు రూ.10.50 లక్షల సొమ్మును, బంగారు ఆభరణాలను, ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.1997 ఐఆర్పీసీ(ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్) బ్యాచ్ కు చెందిన కుమార్ గత జనవరిలో సెన్సార్ బోర్డు అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

మరిన్ని వార్తలు