ఛోటా రాజన్ కస్టడీ పొడిగింపు

16 Nov, 2015 18:17 IST|Sakshi
ఛోటా రాజన్ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ: మాఫియా డాన్ ఛోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికల్జేను మరో నాలుగు రోజులు సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. గత అక్టోబర్ 25న ఇండోనేసియాలోని బాలీలో అరెస్టయిన ఛోటా రాజన్ను నవంబర్ 6న భారత్కు తరలించిన సీబీఐ అధికారులు ఢిల్లీలోనే ఉంచి విచారిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నాటికి కస్టడీ గడువు ముగియడంతో అధికారులు.. ఢిల్లీ సీబీఐ కోర్టు ఎదుట ఛోటాను హాజరుపర్చారు. ఈ నెల 19 వరకు రాజన్ను సీబీఐ కస్టడీకి అప్పగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

ప్రస్తుతం ఛోటా రాజన్ ను సీబీఐ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో ఉంచి విచారిస్తున్నారు. కాగా, గత శుక్రవారం రాజన్ను ఆయన సోదరీమణులు కలుసుకున్నారు. 'భాయ్ దూజ్' పండుగ సందర్భంగా తమ సోదరుణ్ని కలుసుకునేందుకు అనుమతించాలని రాజన్ సోదరీమణులు కోర్టును అభ్యర్థించడంతో ఆమేరకు అనుమతి లభించింది. ముంబై, ఢిల్లీ నగరాల్లో చోటుచేసుకున్న 80 కేసుల్లో ప్రధాని నిందితుడిగా ఉన్న ఛోటా రాజన్.. భారత్ నుంచి పారిపోయి 27 ఏళ్లపాటు విదేశాల్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు