మాల్యా అరెస్ట్‌ తర్వాత మరో కీలక పరిణామం

2 May, 2017 13:57 IST|Sakshi
మాల్యా అరెస్ట్‌ తర్వాత మరో కీలక పరిణామం

భారీరుణ ఎగవేతదారుడు, పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించే ప్రయత్నాలను అధికారులు ముమ్మరం చేశారు.   ముఖ్యంగా ఇటీవల  లిక్కర్ కింగ్‌ అరెస్ట్‌ తరువాత భారత విచారణ అధికారులు మరింత వేగంగా కదులుతున్నారు.  ఈ మేరకు  ఎన్‌ఫోర్సెమెంట్ డైరెక్టరేట్ (ఇడి) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సీనియర్ అధికారుల ప్రత్యేక బృందం  లండన్‌ చేరుకుంది.  అక్కడి బ్రిటిష్‌ న్యాయవాదులతో చర్చలు జరపనున్నారు.
 
భారత్‌కు విజయ్‌ మాల్యాను  తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఈడీ, సీబీఐ అధికారులతో కూడిన  బృందం లండన్‌కు చేరుకుంది.  సిబిఐ అదనపు డైరెక్టర్ రాకేష్ ఆస్తానా నేతృత్వంలో బృందం  ఈ వ్యవహారాన్ని పరిశీలించనున్నారు. మాల్యాను దేశానికి తిరిగి తీసుకు వచ్చేందుకు లండన్‌ విచారణ అధికారులు  పూర్తిగా సహకరిస్తున్నట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. అలాగే ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శులు  రాజీవ్ మెహ్రిషి , అంబర్ రుద్ల  చర్చించనున్నట్టు చెప్పాయి. గత వారం లండన్‌లో మాల్యా అరెస్ట్‌ అయినప్పటినుంచి సీబీఐ, ఈడీ , బ్రిటిష్‌ న్యాయవాదులు పరస్పరంతో సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపాయి.
కాగా ఇటీవల లండన్‌ లో అరెస్ట్‌ చేసిన విజయ్ మాల్యాకు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసు మే 17న విచారణకు రానున్న సంగతి తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు