బ్రేకింగ్‌: సీఎంకు, ఆయన భార్యకు బెయిలివ్వొద్దు

29 May, 2017 10:50 IST|Sakshi
సీఎంకు, ఆయన భార్యకు బెయిలివ్వొద్దు
  • అక్రమాస్తుల కేసులో సీబీఐ వాదన
  • న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తులు కేసులో హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌, ఆయన భార్య సోమవారం పటియాల హౌస్‌ కోర్టు ముందు హాజరయ్యారు. తమకు బెయిల్‌ ఇవ్వాలని వారితోపాటు మిగత నిందితులు కోర్టులో దరఖాస్తు చేశారు. అయితే, వారికి షాక్‌ ఇస్తూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ నిందితులకు బెయిల్‌ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సీఎం వీరభద్రసింగ్‌, ఆయన భార్యకు బెయిల్‌ ఇవ్వవద్దని, బెయిల్‌ ఇస్తే వారు కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని వాదించింది. ప్రస్తుతం న్యాయస్థానం ఈ విషయంలో ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలను వింటోంది.

    గత యూపీఏ-2 ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా వీరభద్రసింగ్‌ పనిచేశారు. ఆ సమయంలో 2009 నుంచి 2011 మధ్య ఆయన, కుటుంబ సభ్యులు కలిసి రూ.10 కోట్ల దాకా అక్రమాస్తులు కూడబెట్టారని సీబీఐ 2015 సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే రూ.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

మరిన్ని వార్తలు