రికార్డు మార్కులు సాధించిన రక్షా గోపాల్‌!

28 May, 2017 15:37 IST|Sakshi
రికార్డు మార్కులు సాధించిన రక్షా గోపాల్‌!
  • సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో టాపర్‌
  • మూడు సబ్జెక్టుల్లోనూ నూటికి నూరు మార్కులు
  • సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఆదివారం 12వ తరగతి (సీనియర్‌ ఇంటర్‌) ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో నొయిడాలోని అమిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుతున్న రక్షా గోపాల్‌ టాపర్‌గా నిలిచింది. 99.6శాతం స్కోరు సాధించిన రక్ష మొదటి స్థానంలో నిలువగా, చండీగఢ్‌కు చెందిన భూమి సావంత్‌ 99.4శాతం మార్కులతో రెండోస్థానంలో నిలిచింది.

    మొత్తం ఐదు సబ్జెక్టుల్లో రక్షకు మూడింటిలో నూటికి నూరు మార్కులు రావడం గమనార్హం. ఇంగ్లిష్‌, పొలిటికల్‌ సైన్స్, ఎకనామిక్స్‌ సబ్జెక్టులలో ఆమెకు 100 చొప్పున మార్కులు రాగా, హిస్టరీ, సైకాలజీలో 99చొప్పున మార్కులను సాధించింది. చదువులో ఎప్పుడూ ముందుండే రక్ష ఢిల్లీ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌ చదువాలని కోరుకుంటోంది. అమ్మాయిలు 87.50శాతం పాసవ్వగా, అబ్బాయిలు 78శాతం మంది మాత్రమే పాసయ్యారు.

మరిన్ని వార్తలు