కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త

25 Aug, 2015 18:06 IST|Sakshi
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు మరో రెండు నెలలు వాయిదా పడనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుపై నివేదిక ఆలస్యమే ఇందుకు కారణమని తెలిసింది.

సెప్టెంబర్ 15 నాటికి కేంద్రానికి నివేదిక అందే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 90 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు సైనికులుగా, పారామిలిటరీ దళాలుగా పనిచేస్తున్నారు. కొందరు రైల్వేశాఖలో, పోస్టల్ శాఖలలో పనిచేస్తున్నారు. దీంతో జీతాల పెంపుకోసం ఎదురుచూస్తున్న 54 లక్షల మంది ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. ఉద్యోగుల జీతాల పెంపుపై 7వ వేతన సంఘం చైర్మన్, జస్టీస్ ఏకె మాథూర్ ప్రభుత్వాన్ని రెండు నెలల గడువును కోరారు.

అయితే అప్పటివరకు వేతన సంఘం నుంచి మధ్యంతర నివేదిక వెలువబడే అవకాశం లేదని సమాచారం. కొత్త జీతాల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపిన అనంతరం వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గత ఫిబ్రవరి 2014లో 7వ వేతన సంఘాన్ని నియమించిన యూపీఏ ప్రభుత్వం, దీనికి సంబంధించిన నివేదికను సమర్పించడానికి 18 నెలల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు